15, అక్టోబర్ 2010, శుక్రవారం

మరుగేలరా ఓ రాఘవ

రాగం: జయంతశ్రీ
తాళం: దేశాది

మరుగేలరా
ఓ రాఘవ ||పల్లవి||

మరుగేల చరాచర రూప పరాత్పర
సూర్య సుధాకర లోచన ||అను పల్లవి||

అన్ని నీవనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్య
నిన్నే గాని మది నెన్న జాలనొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగరాజ నుత ||చరణం||

సామజ వర గమన

రాగం: హిందోళం తాళం: ఆది

సామజ వర గమన సాధు హృత్
సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత ||పల్లవి||

సామ నిగమజ సుధా మయ గాన విచక్షణ ||అను పల్లవి||
గుణ శీల దయాలవాల మాం పాలయ

వేద శిరో మాతృజ సప్త స్వర
నాదాచల దీప స్వీకృత
యాదవ కుల మురళీ వాదన
వినోద మోహన కర త్యాగరాజ వందనీయ ||చరణం||

సీతా కల్యాణ వైభోగమే

రాగం: శంకరాభరణం తాళం : ఝంప

సీతా కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే ||పల్లవి||

పవనజ స్తుతి పాత్ర పవన చరిత్ర
రవి సోమ వర నేత్ర రమణీయ గాత్ర (సీతా) ||చరణం 1||

భక్త జన పరిపాల భరిత శర జాల
భుక్తి ముక్తి ద లీల భూ దేవ పాల (సీతా) ||చరణం 2||

పామరాసుర భీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేత ధామ (సీతా) ||చరణం 3||

సర్వ లోకాధార సమరైక వీర
గర్వ మానవ దూర కనకాగ ధీర (సీతా) ||చరణం 4||

నిగమాగమ విహార నిరుపమ శరీర
నగ ధరాఘ విదార నత లోకాధార (సీతా) ||చరణం 5||

పరమేశ నుత గీత భవ జలధి పోత
తరణి కుల సంజాత త్యాగరాజ నుత (సీతా) ||చరణం 6||

నిగమ నిగమాంత

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణా
నారాయణా శ్రీమన్నారాయణా
నారాయణ వేంకట నారాయణా

దీపీంచు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ
నోపక కదా నన్నూ నొడబరపుచూ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణా

చీకాకు పడిన నా చిత్త శాంతము సేయ
లేకకా నీవు బహులీల నన్ను కాకు
చెసేదవు బహు కర్మముల
పరువారు నాకొలది వారలా నారాయణా

వివిధ నిర్భంధముల
వెడల ద్రోయక నన్ను
భవసాగరమున తడబడజేతువా
దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువేంకటాధీశ
నవనీత చోర శ్రీ నారాయణా

రామచంద్రాయ మంగళం

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్ట దాయ మహిత మంగళం
కోసలేశాయ మంద హాస దాస పోషణాయ
వాసవాది వినుత సద్వరాయ మంగళం
చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ
హార కటక శోభితాయ భూరి మంగళం
లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ
జలజ సదృశ దేహాయ చారు మంగళం
దేవకీ సుపుత్రాయ దేవదేవో దత్తమాయ
పావనా గురువరాయ సర్వ మంగళం
పుణ్డరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ
అండజా వాహనాయ అతుల మంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయా
సుముఖ చిత్త కామితాయ శుభ మంగళం
రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం

14, అక్టోబర్ 2010, గురువారం

ముద్దుగారే యశోద

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస
చెంతల మాలో నున్న చిన్నికృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్థనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ముగాచే కమలాక్షుడు

కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజల నిధిలోని బాయని దివ్యరత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు

బ్రహ్మ మొకటే

తందనాన ఆహి తందనాన పురే
తందనాన భళా తందనా

బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే
పరబ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే

కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకులమింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటు నిద్ర అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే
చండాలు డుండేటి సరిభూమి యొకటే

అనుగుదేవతలకును అలకామ సుఖమొకటే
ఘనకీట పశువులకు కామ సుఖమొకటే
దినమహో రాత్రములు తెగి ధనాఢ్యునకొకటే
వొనర నిరుపేదకును వొక్కటే అవియు

కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే
పరగ దుర్గంధములపై వాయువొకటే
వరుస బరిమళముపై వాయువొకటే

కడగి యేనుగు మీద గాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే
కడు పుణ్యులను పాప కర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే

అలర చంచలమైన

అలర చంచలమైన ఆత్మలందుండ
నీ యలవాటు చేసె నీ ఉయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ
నీ భావంబు దెలిపె నీ ఉయ్యాల
||పల్లవి||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన
ఉడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డదూలంబైన
అఖిలంబు నిండె నీ ఉయ్యాల ||చరణం 1||

పదిలముగ వేదములు బంగారు చేరులై
పట్టి వెరపై తోచె ఉయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై
మిగుల వర్ణింప నరుదాయె ఉయ్యాల ||చరణం 2||

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల
మెరుగునకు మెరుగాయె ఉయ్యాల
నీల శైలము వంటి నీ మేనికాంతికిని
నిజమైన తొడవాయె ఉయ్యాల ||చరణం 3||

పాలిండ్లు కదలగా పయ్యదలు
రాపాడ భామినులు వడినూచు ఉయ్యాల
ఓలి బ్రహ్మాండములు ఒరగువో యని
భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||చరణం 4||

కమలకును భూపతికి కదలు కదలకు
మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస
మందంద చూపె నీ ఉయ్యాల ||చరణం 5||

కమలాసనాదులకు కన్నుల పండుగై
గణుతింప నరుదాయె ఉయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి
నీకు కడువేడుకై వుండె ఉయ్యాల ||చరణం 6||

పాహి రామ ప్రభో


పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో
పాహి రామ ప్రభో

ఇందిరా హృదయారవిందాది రూడ
సుందరాకార నానంద రామ ప్రభో
ఎందునే చూడ మీ సుందరానందము
కందునో కన్నులింపొంద శ్యామ ప్రభో

బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్షితానంద రామ ప్రభో
తల్లివీ నీవే తండ్రివీ నీవే
మా ధాతవు నీవు మా భ్రాత రామ ప్రభో

నీదు బాణంబులను నాదు శతృల బట్టి
బాధింపకున్నావాదేమి రామ ప్రభో
ఆది మధ్యాంత బహిరంతరాత్ముడనుచు
వాదింపునే జగన్నాథ రామ ప్రభో

శ్రీ రామ రామేతి శ్రేష్ట మంత్రము
సారె సారెకును వింతగా చదువు రామ ప్రభో
శ్రీరామ నీ నామ చింతనామృత పాన
సారమే నా మది గోరు రామ ప్రభో

కలికి రూపము దాల్చి కలియుగంబున
నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో
అవ్యయుడ వైన ఈ అవతారముల వలన
దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో

పాహి శ్రీరామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్రశీల రామ ప్రభో
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో


సమయానికి తగు మాటలాడెనే

రాగం : ఆరభి తాళం : ఆది

సాధించెనే ఓ మనసా ||పల్లవి||

భోధించిన సన్మార్గ వచనముల
బొంకు జేసి తా పట్టిన పట్టు ||అను పల్లవి||

సమయానికి తగు మాటలాడెనే
దేవకీ వసుదేవుల నేకించినటు(సమయానికి)

రంగేశుడు సద్గంగా జనకుడు
సంగీత సంప్రదాయకుడు (సమయానికి)

గోపీ జన మనోరథ మొసంగ లేకనే
గేలియు జేసే వాడు(సమయానికి)

వనితల సదా సొక్క జేయుచును
మ్రొక్క జేసే పరమాత్ముడదియు గాక
యశోద తనయుడంచు ముదంబునను
ముద్దు పెట్ట నవ్వుచుండు హరి (సమయానికి)

సారాసారుడు సనక సనందన
సన్ముని సేవ్యుడు సకలాధారుడు (సమయానికి)

పరమ భక్త వత్సలుడు సుగుణ
పారా వారుండాజన్మ మనఘుడీ
కలి బాధల తీర్చువాడనుచు నే
హృదాంబుజమున జూచుచుండగ (సమయానికి)

హరే రామచంద్ర రఘుకులేశ
మృదు సుభాష శేషశయన
పర నారీ సోదరాజ విరాజ తురగ
రాజ రాజ నుత నిరామయాప ఘన
సరసీరుహ దళాక్షయనుచు
వేడుకొన్న నన్ను తా బ్రోవకను (సమయానికి)

శ్రీ వేంకటేశ స్వప్రకాశ
సర్వోన్నత సజ్జన మానస నికేతన
కనకాంబర ధర లసన్మకుట
కుండల విరాజిత హరేయనుచు నే
పొగడగా త్యాగరాజ గేయుడు
మానవేంద్రుడైన రామచంద్రుడు (సమయానికి)

సమయానికి తగు మాటలాడెనే
సద్భక్తుల నడతలిట్లనెనే
అమరికగా నా పూజ కొనెనే అలుక వద్దనెనే
విముఖులతో చేర బోకుమనెనే
వెత గల్గిన తాళు కొమ్మనెనే
దమ శమాది సుఖ దాయకుడగు శ్రీ
త్యాగరాజ నుతుడు చెంత రాకనే (సాధించెనే) ||చరణం ||


పలుకే బంగార మాయనా

పలుకే బంగార మాయనా కోదండ పాణి
పలుకే బంగార మాయె పిలచిన పలుక వేమి
కలలో నీ నామ స్మరణ మరవ చక్కని తండ్రి ||పల్లవి||

ఇరువుగ ఇసుకలోన బొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితి వని నెర నమ్మితి నిన్నే తండ్రి ||చరణం 1||

రాతి నాతిగ జేసి భూతలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ||చరణం 2||

ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతంబు సేయ నే నెంతటి వాడను తండ్రి ||చరణం 3||

శరణాగత త్రాణ బిరుదాంకితుడవు గాదా
కరుణించు భద్రాచల వర రామదాస పోష ||చరణం 4||

గంధము పుయ్యరు గా

గంధము పుయ్యరు గా
పన్నీరు గంధము పుయ్యరుగా ||పల్లవి||

అందమైన యదు నందనుపై
కుందరదన లిరువొందగ పరిమళ ||అను పల్లవి||

తిలకము దిద్దరు గా కస్తూరి తిలకము దిద్దరు గా
కల కలమను ముఖ కళ గని సొక్కుచు
పలుకుల నమృతము లొలికెడి స్వామికి ||చరణం 1||

చేలము గట్టరు గా బంగారు చేలము గట్టరు గా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాల నయనునికి ||చరణం 2||

హారతులెత్తరు గా ముత్యాల హారతులెత్తరు గా
నారీ మణులకు వరము యౌవన
వారకమొసగెడు వారిజాక్షునికి
పూజలు చేయరు గా మనసార పూజలు చేయరుగా
జాజులు మరి విరిజాజులు దవనము
రాజిత త్యాగరాజనుతునికి ||చరణం 3||

కొండలలో నెల కొన్న

కొండలలో నెల కొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు || పల్లవి ||

కుమ్మర దాసుడైన కురు వరతి నంబి
ఇమ్మన్నవరములెల్ల ఇచ్చిన వాడు
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి నమ్మిన వాడు || చరణం ౧ ||

అచ్చపు వేడుక తోడ అనంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు
మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చిన వాడు || చరణం ౨||

కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద
గరుణించి తన యెడకు రప్పించిన వాడు
యెంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచి వాడై కరుణ బాలించిన వాడు ||చరణం ౩||

కట్టెదుర వైకుంఠము

కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ || పల్లవి||

వేదములే శిలలై వెలసినదీ కొండ
యేదెస పుణ్య రాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
శ్రీ దేవుడుండేటి శేషాద్రి కొండ ||చరణం 1||

సర్వ దేవతలు మృగ జాతులై చెరించే కొండ
నిర్వహించి జలఢులే నిట్ట చేరులైన కొండ
ఉర్వి తపసులే తరువులై నిలచిన కొండ
పూర్వటంజనాద్రి ఈ పొడవాటి కొండ ||చరణం 2||

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీ కంతు శోభనపు కొండ
కురిసి సంపద లెల్ల గుహల నిండిన కొండ
విరివైన దది వో శ్రీ వేంకటపు కొండ ||చరణం 3||

13, అక్టోబర్ 2010, బుధవారం

జగ దానంద కారకా

జగ దానంద కారకా జయ జానకి ప్రాణ నాయక ||పల్లవి||

గగనాధిప సద్కులజ
రాజ-రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య
భవ్య-దాయక సదా సకల (జగదానంద)||అను పల్లవి||

అమర-తారక-నిచయ కుముదహిత
పరిపూర్ణానఘ సుర సురభూజ
దధిపయోధి వాస హరణ సుందరతర-వదన
సుధామయ వచో-వృంద గోవింద సానంద
మావరాజరాప్త శుభకరానేక (జగదానంద) || చరణం 1||

నిగమ-నీరజామృతజ-పోషకా-
నిమిష వైరివారిద-సమీరణ
ఖగ-తురంగ సద్కవి-హృదాలయా-
గణిత-వానరాధిప నతాంఘ్రియుగ ||చరణం 2||

ఇంద్రనీల మణి సన్నిభాపఘన
చంద్ర-సూర్య-నయనాప్రమేయ
వాగింద్ర-జనక సకలేశ శుభ్ర
నాగేంద్ర-శయన శమన-వైరి సన్నుత || చరణం 3 ||

పాద-విజిత-మౌని-శాప
సవ-పరిపాల వరమంత్ర-గ్రహణ-లోల
పరమ-శాంత సిద్ధ జనకజాధిప
సరోజభవ వరదాఖిల (జగదానంద) || చరణం 4||

సృష్టి-స్థిత్యంత-కారకామిత
కామిత ఫలదాసమాన గాత్ర
శచీపతినుతాబ్ధి మదహరా-
నురాగ రాగ-రాజిత కథా-సారహిత || చరణం 5 ||

సజ్జన-మానసాబ్ధి-సుధాకర
కుసుమ-విమాన
సురసారిపు కరాబ్జ లాలిత చరణా
వగుణాసురగణ మద-హరణ
సనాతనాజనుత || చరణం 6 ||

ఓంకార పంజర-కీర
పురహర సరోజభవ కేశవాదిరూప
వాసవ-రిపు జనకాంతక
కలాధర కలాధరాప్త ఘృణాకర
శరణాగత జన పాలన
సుమనోరమణ నిర్వికార
నిగమసారతర || చరణం 7 ||

కరధృత శర-జాలా
సుర మదాపహరణా
వనీ-సుర సురావన కవీన
బిలజ మౌని కృత చరిత్ర
సన్నుత శ్రీ త్యాగరాజనుత || చరణం 8 ||

పురాణ పురుష నృవరాత్మజా
శ్రిత పరాధీన
ఖర విరాధ రావణ విరావణా
నఘ పరాశర మనోహరా
వికృత త్యాగరాజ సన్నుత || చరణం 9 ||

అగణిత-గుణ కనక-చేల
శాల విదలనారుణాభ సమాన చరణా
పార మహిమాద్భుత
సుకవి-జన హృద్సదన
సుర-మునిగణ విహిత
కలశ నీరనిధిజా రమణ
పాప గజ నృసింహ
వర త్యాగరాజాది నుత || చరణం 10 ||

ఏమొకో చిగురుటధరమున

ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ||పల్లవి||

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన యా కొనచూపులు
నిలువున పెరుకగ నంటిన నెత్తురు కాదు కదా ||చరణం 1 ||

పడతికి చనుగవ మెరుగులు పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
ఉడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగ వేసవి కాలపు వెన్నెల కాదు కదా ||చరణం 2 ||

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కౌగిట యధరామృతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా ||చరణం 3 ||

జగడపు చనవుల జాజర


జగడపు చనవుల జాజర
సగినల మంచపు జాజర ||పల్లవి||

మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై
చల్లే రతివలు జాజర ||చరణం 1 ||

భారపు కుచముల పైపైగడు సిం-
గారము నెరపేటి గంధవొడి
చేరువ పతిపై చిందగ బడతులు
సారెకు జల్లేరు జాజర ||చరణం 2 ||

బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమదంబుల జాజర ||చరణం 3 ||

పిడికిట తలంబ్రాల

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత ||పల్లవి||
పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు

పేరుకల జవరాలీ పెండ్లి కూతురు పెద్ద
పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాడ్ల నడిమి పెండ్లి కూతురు విభు
పేరుకుచ్చ సిగ్గువడి బెండ్లి కూతురు ||చరణం 1||

బిరుదు పెండెము వెట్టె పెండ్లి కూతురు నెర
బిరుదు మగని కంటె పెండ్లి కూతురు
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురు పతి
బెరరేచి నిదివో పెండ్లి కూతురు ||చరణం 2||

పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె
పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు
గట్టిగా వేంకటపతి కౌగిటను వడి
వెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||చరణం 3||

క్షీరాబ్ది కన్యకకు


క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహా లక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం ||పల్లవి||

జలజాక్షి మోమునకు జక్కువ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు, హస్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం ||చరణం 1||

పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణీయై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్ మంగ చక్కదనముల కెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం ||చరణం 2||

చరణ కిసలయములకు సఖియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిధి జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ||చరణం 3||

నగుమోము గనలేని


నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రారాదా శ్రీ రఘువర నీ ||పల్లవి||

నగరాజధర నీదు పరివారులెల్ల
వొగి బోధన చేసే వారలు గారే యిటులుందుదురే నీ ||అను పల్లవి||

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో
గగనాని కిలకు బహు దూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా ||చరణం||

బంటు రీతి

రాగం: హంసనాదం తాళం: ఆది

బంటు రీతి కొలువీయవయ్య రామ ||పల్లవి||

తుంట వింటి వాని మొదలైన
మదాదుల బట్టి నేల గూల జేయు నిజ ||అను పల్లవి||

రోమాంచ మనే ఘన కంచుకము
రామ భక్తుడనే ముద్ర బిళ్ళయు
రామ నామ మనే వర ఖడ్గ మిచ్చి
రాజిల్లు నయ్య త్యాగరాజునికి ||చరణం||

ఓడను జరిపే

ఓడను జరిపే ముచ్చట గనరే వనితలార నేడు ||పల్లవి||

ఆడువారు యమున కాడ కృష్ణుని గూడి
ఆడుచు బాడుచు నందరు జూడగ ||అను పల్లవి||

కొందరు హరి కీర్తనములు పాడ
కొందరానందమున ముద్దులాడ
కొందరు యమునా దేవిని వేడ
కొందరి ముత్యపు సరులసి యాడ ||చరణం 1||

కొందరు తడవడ పాలిండ్లు కదల
కొందరు బంగారు వల్వలు సడల
కొందరి కుటిలాలకములు మెదల
కొందరు పల్కుచు కృష్ణుని కథల||చరణం 2||

కొందరు త్యాగరాజ సఖుడే యనగ
కొందరి కస్తూరి బొట్టు కరుగగ
కొందరి కొప్పుల విరులెల్ల జారగ
కొందరి కంకణములు ఘల్లనగ ||చరణం 3||

బ్రహ్మ కడిగిన పాదము


బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము

ఛెలగి వసుధ కొలచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలిరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము

పరమయోగులకు పరిపరి విధముల
వర మొసగెడి నీ పాదము
తిరు వేంకట గిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము

భావములోన బాహ్యము నందును

భావములోన బాహ్యము నందును
గోవింద గోవింద యని కొలువవో మనసా


హరి యవతారములే అఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి అనవో మనసా


విష్ణు నీ మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణు డొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదక వో మనసా


అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీ వేంకటాద్రి మీద నిదె
అచ్యుత అచ్యుత శరణనవో మనసా

12, అక్టోబర్ 2010, మంగళవారం

బ్రోచే వారెవరురా

బ్రోచే వారెవరురా నిను వినా రఘు వరా నను
నీ చరణాం భుజములు నే విడజాల కరుణాల వాల

ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్య
నీ చరితము పొగడ లేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమే నను

సీతాపతే నా పై నీ కభిమానము లేదా
వాతత్మజార్చిత పాద నా మొరలను వినా రాదా
ఆతురముగా కరి రాజుని బ్రోచిన వాసుదేవుడే నీవు గదా
నా పాతక మెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక నను

నను బ్రోవమని చెప్పవే

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పు నారి శిరోమణి
జనకుని కూతురా జనని జానకమ్మ

నను బ్రోవమని చెప్పు నారి శిరోమణి
జనకుని కూతురా జనని జానకమ్మ

ప్రక్కన చేరి చెక్కిలి నొక్కుచు
చక్కగా మరి కేళి జొక్కి యుండు వేళ

లోకంత రంగుడు శ్రీకాంత నిను గూడి
ఏకాంతమున ఏక శయ్య నున్న వేళ

అద్రిజ వినుతుడు భద్ర గిరీశుడు
నిద్ర మేల్కొను వేళ నెలతరో భోధించి

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే

అలరులు కురియగ



అలరులు కురియగ ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ

అర విరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరగున నాడెనదే
వరుస పూర్వ దువాళపుతిరుపుల
హరి గరిగింపుచు నలమేల్ మంగ

మట్టపు మలపుల మట్టెల కెలపుల
తట్టెడి నడపుల దాటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేల్ మంగ

చిందుల పాటల సిరి పొలియాటల
అందెల మోతల నాడెనదే
కందువ తిరు వేంకట పతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేల్ మంగ

భావం : అన్నమయ్య ఈ కీర్తన లో అలిమేల్ మంగ తన ఆట పాటలతో తన పాటి ఐన వేంకటేశ్వరుని ఎలా ఆనందింప చేస్తోందో వర్ణిస్తున్నాడు.

చేరి యశోదకు

అన్నమయ్య ఈ కీర్తన లో యశోద నందనుడైన బాల కృష్ణుని స్తుతిస్తున్నాడు. దుఃఖ్క సాగరం లో మునిగి వున్నవాడు కూడా కృష్ణ ప్రభావం వల్ల ఆనందాన్ని పొందుతాడు, ఎవరు అన్నింటిని వదిలేసి తన శరణు జొచ్చుతారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని భావం.

చేరి యశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు

సొలసి చూచినను సూర్యచంద్రులను
లలివెద జల్లడు లక్షణుడు
నిలిచిన నిలువున నిఖిల దేవతల
కలిగించు సురల గని వో ఇతడు

మాట లాడినను మరి యజాండములు
కోటులు వొడమేటి గుణ రాశి
నీతగు నూర్పుల నిఖిల వేదములు
చాటువ నూరేటి సముద్ర మితడు

ముంగిట పొలసిన మోహనమాత్మల
పొంగించే ఘన పురుషుడు
సంగతి మా వంటి శరణాగతులకు
సంగము శ్రీ వేంకటాథిపుడితడు

7, అక్టోబర్ 2010, గురువారం

నా ఫొటోగ్రఫి