15, అక్టోబర్ 2010, శుక్రవారం

మరుగేలరా ఓ రాఘవ

రాగం: జయంతశ్రీ
తాళం: దేశాది

మరుగేలరా
ఓ రాఘవ ||పల్లవి||

మరుగేల చరాచర రూప పరాత్పర
సూర్య సుధాకర లోచన ||అను పల్లవి||

అన్ని నీవనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్య
నిన్నే గాని మది నెన్న జాలనొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగరాజ నుత ||చరణం||

సామజ వర గమన

రాగం: హిందోళం తాళం: ఆది

సామజ వర గమన సాధు హృత్
సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత ||పల్లవి||

సామ నిగమజ సుధా మయ గాన విచక్షణ ||అను పల్లవి||
గుణ శీల దయాలవాల మాం పాలయ

వేద శిరో మాతృజ సప్త స్వర
నాదాచల దీప స్వీకృత
యాదవ కుల మురళీ వాదన
వినోద మోహన కర త్యాగరాజ వందనీయ ||చరణం||

సీతా కల్యాణ వైభోగమే

రాగం: శంకరాభరణం తాళం : ఝంప

సీతా కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే ||పల్లవి||

పవనజ స్తుతి పాత్ర పవన చరిత్ర
రవి సోమ వర నేత్ర రమణీయ గాత్ర (సీతా) ||చరణం 1||

భక్త జన పరిపాల భరిత శర జాల
భుక్తి ముక్తి ద లీల భూ దేవ పాల (సీతా) ||చరణం 2||

పామరాసుర భీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేత ధామ (సీతా) ||చరణం 3||

సర్వ లోకాధార సమరైక వీర
గర్వ మానవ దూర కనకాగ ధీర (సీతా) ||చరణం 4||

నిగమాగమ విహార నిరుపమ శరీర
నగ ధరాఘ విదార నత లోకాధార (సీతా) ||చరణం 5||

పరమేశ నుత గీత భవ జలధి పోత
తరణి కుల సంజాత త్యాగరాజ నుత (సీతా) ||చరణం 6||

నిగమ నిగమాంత

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణా
నారాయణా శ్రీమన్నారాయణా
నారాయణ వేంకట నారాయణా

దీపీంచు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ
నోపక కదా నన్నూ నొడబరపుచూ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణా

చీకాకు పడిన నా చిత్త శాంతము సేయ
లేకకా నీవు బహులీల నన్ను కాకు
చెసేదవు బహు కర్మముల
పరువారు నాకొలది వారలా నారాయణా

వివిధ నిర్భంధముల
వెడల ద్రోయక నన్ను
భవసాగరమున తడబడజేతువా
దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువేంకటాధీశ
నవనీత చోర శ్రీ నారాయణా

రామచంద్రాయ మంగళం

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్ట దాయ మహిత మంగళం
కోసలేశాయ మంద హాస దాస పోషణాయ
వాసవాది వినుత సద్వరాయ మంగళం
చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ
హార కటక శోభితాయ భూరి మంగళం
లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ
జలజ సదృశ దేహాయ చారు మంగళం
దేవకీ సుపుత్రాయ దేవదేవో దత్తమాయ
పావనా గురువరాయ సర్వ మంగళం
పుణ్డరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ
అండజా వాహనాయ అతుల మంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయా
సుముఖ చిత్త కామితాయ శుభ మంగళం
రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం