పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత ||పల్లవి||
పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పేరుకల జవరాలీ పెండ్లి కూతురు పెద్ద
పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాడ్ల నడిమి పెండ్లి కూతురు విభు
పేరుకుచ్చ సిగ్గువడి బెండ్లి కూతురు ||చరణం 1||
బిరుదు పెండెము వెట్టె పెండ్లి కూతురు నెర
బిరుదు మగని కంటె పెండ్లి కూతురు
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురు పతి
బెరరేచి నిదివో పెండ్లి కూతురు ||చరణం 2||
పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె
పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు
గట్టిగా వేంకటపతి కౌగిటను వడి
వెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||చరణం 3||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి