జగడపు చనవుల జాజర
సగినల మంచపు జాజర ||పల్లవి||
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై
చల్లే రతివలు జాజర ||చరణం 1 ||
భారపు కుచముల పైపైగడు సిం-
గారము నెరపేటి గంధవొడి
చేరువ పతిపై చిందగ బడతులు
సారెకు జల్లేరు జాజర ||చరణం 2 ||
బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమదంబుల జాజర ||చరణం 3 ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి