14, అక్టోబర్ 2010, గురువారం

కొండలలో నెల కొన్న

కొండలలో నెల కొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు || పల్లవి ||

కుమ్మర దాసుడైన కురు వరతి నంబి
ఇమ్మన్నవరములెల్ల ఇచ్చిన వాడు
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి నమ్మిన వాడు || చరణం ౧ ||

అచ్చపు వేడుక తోడ అనంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు
మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చిన వాడు || చరణం ౨||

కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద
గరుణించి తన యెడకు రప్పించిన వాడు
యెంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచి వాడై కరుణ బాలించిన వాడు ||చరణం ౩||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి