14, అక్టోబర్ 2010, గురువారం

పలుకే బంగార మాయనా

పలుకే బంగార మాయనా కోదండ పాణి
పలుకే బంగార మాయె పిలచిన పలుక వేమి
కలలో నీ నామ స్మరణ మరవ చక్కని తండ్రి ||పల్లవి||

ఇరువుగ ఇసుకలోన బొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితి వని నెర నమ్మితి నిన్నే తండ్రి ||చరణం 1||

రాతి నాతిగ జేసి భూతలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ||చరణం 2||

ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతంబు సేయ నే నెంతటి వాడను తండ్రి ||చరణం 3||

శరణాగత త్రాణ బిరుదాంకితుడవు గాదా
కరుణించు భద్రాచల వర రామదాస పోష ||చరణం 4||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి