13, అక్టోబర్ 2010, బుధవారం

బ్రహ్మ కడిగిన పాదము


బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము

ఛెలగి వసుధ కొలచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలిరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము

పరమయోగులకు పరిపరి విధముల
వర మొసగెడి నీ పాదము
తిరు వేంకట గిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి