14, అక్టోబర్ 2010, గురువారం

పాహి రామ ప్రభో


పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో
పాహి రామ ప్రభో

ఇందిరా హృదయారవిందాది రూడ
సుందరాకార నానంద రామ ప్రభో
ఎందునే చూడ మీ సుందరానందము
కందునో కన్నులింపొంద శ్యామ ప్రభో

బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్షితానంద రామ ప్రభో
తల్లివీ నీవే తండ్రివీ నీవే
మా ధాతవు నీవు మా భ్రాత రామ ప్రభో

నీదు బాణంబులను నాదు శతృల బట్టి
బాధింపకున్నావాదేమి రామ ప్రభో
ఆది మధ్యాంత బహిరంతరాత్ముడనుచు
వాదింపునే జగన్నాథ రామ ప్రభో

శ్రీ రామ రామేతి శ్రేష్ట మంత్రము
సారె సారెకును వింతగా చదువు రామ ప్రభో
శ్రీరామ నీ నామ చింతనామృత పాన
సారమే నా మది గోరు రామ ప్రభో

కలికి రూపము దాల్చి కలియుగంబున
నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో
అవ్యయుడ వైన ఈ అవతారముల వలన
దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో

పాహి శ్రీరామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్రశీల రామ ప్రభో
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి