రాగం : ఆరభి తాళం : ఆది
భోధించిన సన్మార్గ వచనముల
బొంకు జేసి తా పట్టిన పట్టు ||అను పల్లవి||
సమయానికి తగు మాటలాడెనే
దేవకీ వసుదేవుల నేకించినటు(సమయానికి)
రంగేశుడు సద్గంగా జనకుడు
సంగీత సంప్రదాయకుడు (సమయానికి)
గోపీ జన మనోరథ మొసంగ లేకనే
గేలియు జేసే వాడు(సమయానికి)
వనితల సదా సొక్క జేయుచును
మ్రొక్క జేసే పరమాత్ముడదియు గాక
యశోద తనయుడంచు ముదంబునను
ముద్దు పెట్ట నవ్వుచుండు హరి (సమయానికి)
సారాసారుడు సనక సనందన
సన్ముని సేవ్యుడు సకలాధారుడు (సమయానికి)
పరమ భక్త వత్సలుడు సుగుణ
పారా వారుండాజన్మ మనఘుడీ
కలి బాధల తీర్చువాడనుచు నే
హృదాంబుజమున జూచుచుండగ (సమయానికి)
హరే రామచంద్ర రఘుకులేశ
మృదు సుభాష శేషశయన
పర నారీ సోదరాజ విరాజ తురగ
రాజ రాజ నుత నిరామయాప ఘన
సరసీరుహ దళాక్షయనుచు
వేడుకొన్న నన్ను తా బ్రోవకను (సమయానికి)
శ్రీ వేంకటేశ స్వప్రకాశ
సర్వోన్నత సజ్జన మానస నికేతన
కనకాంబర ధర లసన్మకుట
కుండల విరాజిత హరేయనుచు నే
పొగడగా త్యాగరాజ గేయుడు
మానవేంద్రుడైన రామచంద్రుడు (సమయానికి)
సమయానికి తగు మాటలాడెనే
సద్భక్తుల నడతలిట్లనెనే
అమరికగా నా పూజ కొనెనే అలుక వద్దనెనే
విముఖులతో చేర బోకుమనెనే
వెత గల్గిన తాళు కొమ్మనెనే
దమ శమాది సుఖ దాయకుడగు శ్రీ
త్యాగరాజ నుతుడు చెంత రాకనే (సాధించెనే) ||చరణం ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి