12, అక్టోబర్ 2010, మంగళవారం

చేరి యశోదకు

అన్నమయ్య ఈ కీర్తన లో యశోద నందనుడైన బాల కృష్ణుని స్తుతిస్తున్నాడు. దుఃఖ్క సాగరం లో మునిగి వున్నవాడు కూడా కృష్ణ ప్రభావం వల్ల ఆనందాన్ని పొందుతాడు, ఎవరు అన్నింటిని వదిలేసి తన శరణు జొచ్చుతారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని భావం.

చేరి యశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు

సొలసి చూచినను సూర్యచంద్రులను
లలివెద జల్లడు లక్షణుడు
నిలిచిన నిలువున నిఖిల దేవతల
కలిగించు సురల గని వో ఇతడు

మాట లాడినను మరి యజాండములు
కోటులు వొడమేటి గుణ రాశి
నీతగు నూర్పుల నిఖిల వేదములు
చాటువ నూరేటి సముద్ర మితడు

ముంగిట పొలసిన మోహనమాత్మల
పొంగించే ఘన పురుషుడు
సంగతి మా వంటి శరణాగతులకు
సంగము శ్రీ వేంకటాథిపుడితడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి