14, అక్టోబర్ 2010, గురువారం

గంధము పుయ్యరు గా

గంధము పుయ్యరు గా
పన్నీరు గంధము పుయ్యరుగా ||పల్లవి||

అందమైన యదు నందనుపై
కుందరదన లిరువొందగ పరిమళ ||అను పల్లవి||

తిలకము దిద్దరు గా కస్తూరి తిలకము దిద్దరు గా
కల కలమను ముఖ కళ గని సొక్కుచు
పలుకుల నమృతము లొలికెడి స్వామికి ||చరణం 1||

చేలము గట్టరు గా బంగారు చేలము గట్టరు గా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాల నయనునికి ||చరణం 2||

హారతులెత్తరు గా ముత్యాల హారతులెత్తరు గా
నారీ మణులకు వరము యౌవన
వారకమొసగెడు వారిజాక్షునికి
పూజలు చేయరు గా మనసార పూజలు చేయరుగా
జాజులు మరి విరిజాజులు దవనము
రాజిత త్యాగరాజనుతునికి ||చరణం 3||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి