క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహా లక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం ||పల్లవి||
జలజాక్షి మోమునకు జక్కువ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు, హస్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం ||చరణం 1||
పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణీయై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్ మంగ చక్కదనముల కెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం ||చరణం 2||
చరణ కిసలయములకు సఖియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిధి జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ||చరణం 3||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి