దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస
చెంతల మాలో నున్న చిన్నికృష్ణుడు
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస
చెంతల మాలో నున్న చిన్నికృష్ణుడు
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్థనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ముగాచే కమలాక్షుడు
మితి గోవర్థనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ముగాచే కమలాక్షుడు
కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజల నిధిలోని బాయని దివ్యరత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజల నిధిలోని బాయని దివ్యరత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి