14, అక్టోబర్ 2010, గురువారం

కట్టెదుర వైకుంఠము

కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ || పల్లవి||

వేదములే శిలలై వెలసినదీ కొండ
యేదెస పుణ్య రాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
శ్రీ దేవుడుండేటి శేషాద్రి కొండ ||చరణం 1||

సర్వ దేవతలు మృగ జాతులై చెరించే కొండ
నిర్వహించి జలఢులే నిట్ట చేరులైన కొండ
ఉర్వి తపసులే తరువులై నిలచిన కొండ
పూర్వటంజనాద్రి ఈ పొడవాటి కొండ ||చరణం 2||

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీ కంతు శోభనపు కొండ
కురిసి సంపద లెల్ల గుహల నిండిన కొండ
విరివైన దది వో శ్రీ వేంకటపు కొండ ||చరణం 3||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి