1, నవంబర్ 2010, సోమవారం

ఏ తీరుగ నను

ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా ఏ తీరుగ...

శ్రీ రఘు నందన సీతా రమణా శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా ఏ తీరుగ...

క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా ఏ తీరుగ...

వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా
దాసార్చిత మా కభయ మొసంగవే దాశరథీ రఘు రామా ఏ తీరుగ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి